చక్రతీర్థ ముక్కోటి  తిరుమలలో జరిగే ఉత్సవాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నట్లు  ఈనెల 11న టీటీడీ ఘనంగా నిర్వహించనుంది.

ఘనంగా జరగబోయే ఈ ఉత్సవాల్లో  పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వెలిసియున్న శేషగిరికొండ‌ల‌మీద దక్షిణభాగంలోని కొన్ని మైళ్ల దూరంలో మహా పవిత్రమైన చక్రతీర్థం ఉంది. ఏటా తమిళ కార్తీకమాసం శుద్ధ ద్వాదశి పర్వదినాన ఈ చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన శ్రీవారికి ప్రాతఃకాల, మధ్యాహ్న ఆరాధనలు పూర్తయ్యాక అర్చకులు, పరిచారకులు, టీటీడీ ఉద్యోగులు, భక్తులు మంగళవాయిద్యాలతో స్వామివారి ఆలయం నుంచి ప్రదక్షణ చక్రతీర్థానికి వెళ్లనున్నారు. ఇక్కడ వెలసియున్న శ్రీచక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామికి అభిషేకం, పుష్పాలంకరణ, ఆరాధన చేయనున్నారు.తిరుమలలో జరగనున్న ఈ ఉత్సవంలో అధికారులు సామాన్య ప్రజలు అని భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొనాలంటూ ఆలయ అధికారులు తెలిపారు 

e-max.it: your social media marketing partner

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.