తిరుమల: ప్రపంచ ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాది భక్తులతో కిటకిటలాడుంతుందీ తిరునిలయం .ఆపద మొక్కులవాడికి తమ మొక్కులను తీర్చుకోవడానికి పోటీ పడుతుంటారు భక్తులు. ఇలా తమ మొక్కుల కింద వెంకన్నకి విలువ కట్టలేని ఆభరణాలు ఇచ్చారు భక్తులు. బ్రహ్మత్సవాల నేపద్యంలో అసలు వెంకన్నకి ఎన్ని ఆభరణాలు ఉన్నాయి అన్న అంశంపై ప్రత్యేక కధనం.

స్వామివారికి అలంకరించే అత్యంత విలువైన అభరణాలైన రత్నకచిత, వజ్ర వైడూర్యాలు పోదిగిన బంగారు అభరణాలు, ప్రతివారం స్వామివారికి జరిగే అభిషేకం తర్వాత అలకరించడం పరిపాటి. స్వామివారికి అలంకరించిన అభరణాల్లో సహస్రనామ మాల, పచ్చ పోదిగిన కంఠాభరణం, వక్ష స్ధల లక్ష్మీ, లక్ష్మీ హారాలు ఎప్పడు మూల మూర్తికి అలంకరించి ఉంటాయి. ఇవి మినహా మిగిలిన అభరణాలన్నీ మూడు జతలకు పైగా ఉండటంతో టిటిడి వాటిని స్వామివారి అలంకరానికి అనుగుణంగా అభరణాలను మార్చడం జరుగుతోంది. మూలమూర్తి అలంకరణకు ప్రధానంగా 120 రకాల ఆభరణాలు, ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి మరో 383 రకాల ఆభరణాలను వాడుతున్నారు. నాటి రాజులు, రాజవంశీకులు, ఆర్కాటు నవాబులు, బ్రిటీషు ప్రభువులు, మహంతులు ఎన్నెన్నో ఆభరణాలు తయారు చేయించారు. 

1933 టీటీడీ ఆవిర్భావం తర్వాత నుంచి నేటి వరకు భక్తులు వెల కట్టలేని విలువైన ఆభరణాలు తయారు చేయించారు స్వామివారికి ఇచ్చారు. ఇవన్నీ 2010 లెక్కల ప్రకారమే సుమారు 12 టన్నులు ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా.  వీటితోపాటు వజ్రాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నవరత్నాల నగలు ఉన్నాయి. ఇలా స్వామివారి ఆభరణాల కానుకలను నమోదు చేసేందుకు టీటీడీ 19 తిరువాభరణ రిజిస్టర్లు నిర్వహిస్తోంది. స్వామి నగల బాధ్యత 1982 నుంచి1987 వరకు మిరాశీ అర్చకుల వద్ద ఉండేది. 1987లో ఆలయంలో మిరాశీ వ్యవస్థ రద్దుకావటం, కోర్టు కేసుల నేపథ్యంలో 1996 వరకు అర్చకుల చేతిలోనే ఉండేది. ఆ తర్వాత  సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ గెజిట్ నిబంధనల్లో భాగంగా నగల బాధ్యత ఆలయ డెప్యూటీ ఈవో, పేష్కార్ పర్యవేక్షణలోకి వెళ్లింది.

వెంకన్ననగల వివరాలు చూస్తే తొలిసారి ఆకాశరాజు బంగారు కిరీటం చేయించాడు. తరువాత కాలంలో నగలు ఎవరు చేయించారనేది వివారాలులేనప్పటికీ శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలంలో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లు స్వర్ణయుగమేనని చెప్పవచ్చును. తిరుమల శ్రీవారి ఆలయాన్ని చక్రవర్తి హోదాలో ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశాడు. శ్రీకృష్ణ దేవరాయలు 10-02-1513న శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించాడు. 02-05-1513న  నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, రత్నఖచిత మరో చిన్న కత్తి, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించాడు. ఇక తంజావూరు రాజులు పాండ్యన్‌ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. ఇక రాజరికం పోయినప్పటకి తర్వాతి కాలంలో వచ్చిన మహ్మదీయులు, బ్రిటిష్‌ పాలకులు, మహంతుల కాలం నుంచి నేటి ప్రజాప్రభుత్వం వరకూ స్వామి వారికి కానుకల వెల్లువ కొనసాగుతూనే ఉంది.

ఇక స్వామి వారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు. బ్రిటిష్‌ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పని చేసిన థామస్‌ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు. స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌ అనే ముస్లిం సమర్పించడం విశేషం. అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ మీర్జా సమర్పించారు. వేంకటేశ్వర హెచరీస్‌ సంస్థ 13 కిలోల కిరీటం సమర్పించింది. గోయెంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ ‌ సంస్థ రూ.5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను సమర్పించింది. తితిదే కూడా స్వామివారికి వజ్రాలతో కిరీటం, హారం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు తయారుచేయించింది.

స్వామి వారికి ప్రస్తుతం ముఖ్యమైన 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఇవే కాకుండా సువర్ణపద్మపీఠం, సువర్ణపాదాలు, ఉదర బంధము, దశావతార హారము, బంగారు పులిగోరు, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్య కఠారి (ఖడ్గం), కటి వరద హస్తాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ఆకాశరాజు కిరీటం వంటి అనేక ఆభరణాలున్నాయి. ఇవి కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. వాటిలో రత్నకిరీటం, మేరు పచ్చ, రత్నాలతో చేసిన శంఖుచక్రాలు, రత్నాల కరపత్రాలు, రత్నాల కటి వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్త్రాలు తదితరాలు ముఖ్యమైనవి. 2009వ  సంవత్సరంలో  గాలి జనార్ధన రెడ్డి 42 కోట్లు విలువ చేసే వజ్రాల కీరీటాన్ని శ్రీవారికి  సమర్పించాడు. అయితే బరువు ఎక్కున్న కారణంగా ఈ కిరీటాన్ని ప్రస్తుతం వాడటం లేదు టీటీడీ.

 

e-max.it: your social media marketing partner

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.