శ్రీగోవిందరాజస్వామికి ఆలయంలో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు మంగళవారంతో వైభవంగా ముగిశాయి. చివరిరోజు స్వామివారికి చక్రస్నానం కన్నులపండువగా జరిగింది. గోవిందనామ స్మరణలతో స్థానిక కపిలతీర్థంలోని ఆళ్వార్‌ తీర్థంలో ఈచివరి ఘట్టం ముగిసింది. చక్రస్నానం మహోత్సవంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు.

 

https://www.youtube.com/watch?v=_-FKkPUkifM

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు సర్వభూపాల వాహనంపై  వూరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈరోజు సాయంత్రం స్వామివారు తనకు ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై వూరేగనున్నారు.

https://www.youtube.com/watch?v=HXCwyDndZXU

 

పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుని 607 వ జయంతిని సిలికానాంధ్ర సంస్థ అత్యంత ఘనంగా నిర్వహించింది. కాలిఫోర్నియా రాష్ట్రం సన్నివేల్ నగరంలోని సన్నివేల్ హిందూ దేవాలయం  ఈ ఉత్సవాలకు వేదికైంది.

సన్నివేల్ నగర పుర వీధులలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసున్ని ఊరేగిస్తూ నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్త్రీ, పురుషులు  సంప్రదాయ వస్త్రాలంకరణతో గోవింద నామస్మరణ చేస్తూ... సామూహిక అన్నమయ్య గళార్చన చేశారు. 

వీడియో ని క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=yoCsaQzkZXo

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా....గ్రామీణులు, గిరిజనుల ఆరాధ్య దేవతగా...విరాజిల్లుతున్న  మాడుగుల మోదకొండమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.  వనదేవత గా పూజలు అందుకుంటున్న మోదకొండమ్మను గిరిజనులు ఇలవేల్పుగా కొలుచుకుంటారు. భక్తుల కొంగుబంగారంగా  పేరుగాంచిన మాడుగుల మోదకొండమ్మ జాతర పై సి.వి.ఆర్  ఓం సమాచారం ప్రత్యేక కథనం...

క్రింద‌ ఉన్న వీడియో ని క్లిక్ చేయండి. 

https://www.youtube.com/watch?v=lL8-XZtSZlc

 

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...