టిటిడి ఆధ్వర్యంలో  తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన నేటి ఉదయం గోవిందరాజస్వామి సింహ వాహనంపై వూరేగుతూ భక్తులను కటాక్షించారు. గోవిందరాజస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సింహవాహన సేవకు ముందు భక్తుల కోలాటాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం స్వామివారు ముత్యపు పందిరి పై విహరించనున్నారు.

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.