మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధాన శైవక్షేత్రాలతో పాటు చిన్నచిన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్న వేళ, కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రి మాత్రం వెలవెలబోతోంది.

కొండపై ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు జరగడం లేదు. కనకదుర్గమ్మ ఆలయ విస్తరణ పనులలో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్దరణ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం. ఆలయ పనులు శివరాత్రి నాటికి పూర్తి చేయాలని అధికారులు తొలుత భావించినప్పటికీ, అవి పూర్తి కాలేదు. దీంతో ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు రద్దయ్యాయి. విషయం తెలియక కొండపైకి వస్తున్న భక్తులు మల్లన్న దర్శనం లేకుండానే ఉసూరుమంటూ వెనక్కు తిరగాల్సిన పరిస్థితి.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...