యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతూ కొండపైన కొలువై ఉన్న శ్రీపర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడోరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదిదంపతులైన శివపార్వతుల కల్యాణ మహోత్సవం రాత్రి కన్నులపండుగగా జరిగింది.

రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కల్యాణ మహోత్సవం దాదాపు రెండుగంటల పాటు వైభవంగా జరిగింది. కల్యాణ మండపంలో ఆదిదంపతులను అధిష్టింపజేసి కల్యాణ ఘట్టాన్ని ఆరంభించారు అర్చకులు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళవాయిద్యాల కళతాళ ధ్వనుల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా కైలాసవాసుడు పార్వతీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఆ సమయంలో శివాలయ ప్రాంగణం "ఓం నమఃశివాయ, శంభోశంకర" అనే నామస్మరణతో మార్మోగింది. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కల్యాణ మండపం కిక్కిరిసిపోయింది. శివపార్వతుల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఆనందపరవశులైనారు. సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి మొత్తం ఈ కల్యాణ వేడుకను తనివితీరా వీక్షించి పరవశించారని వేదపండితులు భక్తులకు ప్రవచించారు.

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...