మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖలో శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.