విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో గోవర్ధనగిరి పూజామహోత్పవం వైభవంగా నిర్వహించారు. హరేరామ మూమెంట్స్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యాక్రమం భక్తులను అలరించింది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన రోజున గోవర్ధనపూజ నిర్వహించడం ఆనవాయితీ.

ఈ నేపథ్యంలో ముందుగా బలరామకృష్ణులకు విశేషపూజలు నిర్వహించిన అనంతరం నేతి దీపాలతో హారతులు సమర్పించి సకల దేవత నిలయమైన గోవుకు పూజ చేస్తారు. అనంతరం పిండి పదార్ధాలతో తయారుచేసిన గోవర్ధనగిరికి ప్రత్యేక పూజలు నిర్వహించి గోవర్ధనగిరి నమూనాకు భక్తులు స్వయంగా తయారు చేసిన పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలపూడి రామక్రిష్ణబాబు సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ తో పాటు భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...