గతేడాది రికార్డు స్థాయిలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపద మొక్కుల వాడికి కానుకల వర్షం కురిపించారు. 2016 సంవత్సరంలో 2.55 కోట్లమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్క డిసెంబర్‌ నెలలోనే హుండీ ద్వారా రూ. 85 కోట్ల ఆదాయం లభించగా...గత ఏడాది కంటే అదనంగా 20.73 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

కాగా గత ఏడాది కంటే అదనంగా 114కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. హుండీ ఆదాయం కూడా భారీ స్థాయిలో వచ్చింది. ఏడాదిలో 1,018 కోట్ల రూపాయలను భక్తులు హుండీలో సమర్పిం చారు. 10.34 కోట్ల లడ్డూలను భక్తులకు అందజేసినట్లు ఈవో సాంబశివ రావు తెలిపారు. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నారాయణగిరి ఉద్యానవనంలో 16 తాత్కాలిక కంపార్ట్ మెంట్లు ఏర్పాటు చేశామన్నారు. నిరంతరాయంగా భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు జరిగాయని వివరించారు. ఈనెల 8న ఉదయం 9గంటలకు తిరువీధుల్లో స్వర్ణ రథంపై శ్రీవారి వూరేగింపు, 9న వేకువజామున శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో అన్ని అర్జిత సేవలు రద్దు చేసినట్లు చెప్పారు. కనుమ పండుగ రోజున టీటీడీ అధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో గోపూజలు నిర్వహించనున్నట్లు ఈవో సాంబశివరావు తెలిపారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...