ధర్మ పరిరక్షణ కోసం నడుం కట్టిన స్వామి పరిపూర్ణానంద సమాజాన్ని చైతన్యం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా నుండి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

జనవరి 4 నుండి 8వ తేదీ వరకు 5 రోజుల పాటు నగరంలోని ఎన్టిఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో భగవద్గీత పై ప్రవచించనున్నారు. ఉపనిషత్ మందిరం, మిత్రా సాంస్కృతిక సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఈ కార్యక్రమ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. భగవద్గీత 12 వ అధ్యాయం భక్తియోగం పై స్వామి పరిపూర్ణానంద ప్రవచిస్తారని వివరించారు. దేశం కోసం ధర్మం కోసం పాతికేళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తున్న స్వామి పరిపూర్ణానంద తొలిసారిగా శ్రీకాకుళం విచ్చేసి అనుగ్రహ భాషణ చేస్తున్న నేపధ్యంలో ధార్మిక సంఘాలు, భక్తులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి సంభందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.

e-max.it: your social media marketing partner

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.