యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు స్వామి వారు రామావతారంలో హనుమంత వాహనం పై ఊరేగుతూ భక్తులకు దర్శన మిచ్చారు. వజ్ర వైఢుర్యాలతో స్వామివారు ఆలయ తిరువీదుల్లో ఊరేగుతూ ధగధగ మేరిసిపోయారు.

కొండగట్టు శ్రీఅంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జగీత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో శ్రీఅంజనేయస్వామి వారి ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు వేకువజాము నుండి మాఘమాస పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది.

తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అన్నదానం భవనం ఎదురుగా ఉన్న షాపుల్లో అర్ధరాత్రి ఈ అగ్ని ప్రమాదం జరిగింది.

నల్గొండ జిల్లా శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున అగ్నిగుండాలు జరిగాయి. పెద్దసంఖ్యలో భక్తులు, శివసత్తులు అగ్నిగుండాలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఆలయసిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల శివనామస్మరణతో మారుమోగింది.

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.