ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన బాసర సమీపంలోని గోదావరి నదిపై నిర్మించిన రోడ్డు, రైలు వంతెనలు ప్రమాదపు అంచుల్లోకి నెట్టబడుతున్నాయా..? ఈ బ్రిడ్జీలు ఎక్కువకాలం నిలువడం కష్టమేనా..? అంటే అవుననే సంకేతాలు వెలవడుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా ఈ వంతెన స్తంభాలకు అతి దగ్గరలో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో  వంతెనలకు ముప్పుపొంచిఉంది. దీంతో వంతెనలు ప్రమాదంలో పడే అవకాశముండడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతుంది.

 

 

 

అది పచ్చని ప్రాశాంతమైన పల్లె. మంచి మనస్సు గల యువకులున్నా గ్రామం.  కానీ ఆ గ్రామంలోని యువకుల పెళ్లి మాత్రం జరగడం లేదు . మూడు పదుల వయసు దాటినా మూడు ముళ్లు వేసే భాగ్యం ఆ గ్రామ యువకులకు కలగడం లేదు. ఇంతకీ ఆ గ్రామాన్ని వేదిస్తున్న సమస్యేంటి.... ఆ ఊర్లోని యువకులకు పెళ్లిళ్ళు ఎందుకు కావడంలేదు .వివరాలు తెలుసుకోవాలంటే ఈకథనం చూడండి...

తిరుమల శ్రీవారి కొండపై నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. నడకదారి భక్తులకు నాలుగు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టనుంది. ఇదీలా ఉండగా శ్రీవారిని నూతనంగా ఎన్నికైన బీజీపీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు , కాంగ్రెస్ నాయకుడు, కరీంనగర్ మాజీ ఎం.పీ పొన్నం ప్రభాకర్  దర్శించుకున్నారు. శ్రీవారి నైవేథ్య సమయంలో స్వామి వారి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందించారు. 

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.