మహా శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ లోని బ్రహ్మాకుమారీ క్షేత్రాలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీల ప్రధాన శాఖ శాంతి సరోవర్ తో పాటు జంటనగరాల పరిధిలోని అన్ని బ్రహ్మకుమారీ శాఖలలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. బంజారాహిల్స్ లోని నందినగర్ లో ఉన్న బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో జ్యోతిర్లింగాల దర్శనాన్ని భక్తులకు ఏర్పాటుచేశారు. 

సూళ్లూరు పేటలోని నాగలింగేశ్వరాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ధ్వజారోహణ నిర్వహించారు. అనంతరం తిరుచ్చి వాహనోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహా శివరాత్రి ఉత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు, ధ్వజారోహణ సందర్భంగా ప్రసాదాన్ని స్వీకరించేందుకు స్థానికులు తరలివచ్చారు. ఆవుపాలతో ప్రభాత అభిషేక కార్యక్రమాలను నాగలింగేశ్వర స్వామికి నిర్వహించారు.

తిరుమల శ్రీవారికి కొందరు భవంతులిస్తారు...మరి కొందరు భూములిస్తారు. ఇంకొందరు వజ్ర, వైడూర్యాలతో పొదిగిన ఆభరణాలు కానుకలుగా చెల్లిస్తారు. కానీ కడప జిల్లా పులివెందులకు చెందిన రామాంజులరెడ్డి మాత్రం ఓ అపురూపమైన, అరుదైన కానుకను శ్రీవారికి సమర్పించుకున్నారు.

ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన గండికోట ఉత్సవాలను ఈ నెల 18, 19 తేదీలలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2015వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఘనంగా నిర్వహించిన గండికోట ఉత్సవాలను ప్రతి సంవత్సరం అదే తేదీలలో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు సాధ్యం కాలేదు. కడప జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పురాతన కట్టడమైన గండికోట ఉత్సవాలను నిర్వహించి నాటి చరిత్రను మననం చేసుకుంటూ నేటి తరానికి తెలియజెప్పేందుకు తిరిగి నేడు గండికోట ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించడంతో జిల్లా యంత్రాంగంతో పాటు పర్యాటక శాఖ ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది.

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.