ఇంటిదొంగల చేతివాటంతో బెజవాడ కనక దుర్గమ్మ ఆలయంలో అమ్మవారి సొమ్ము పక్కదోవ పడుతోంది.

వైకుంఠ ఏకాదశి రోజు....ధనుర్మాసం అత్యంత పవిత్రమైనది. ఆ మాసంలో ఎన్నో పర్వదినాలు. అందులో ఒకటి ముక్కోటి ఏకాదశి. పరమపవిత్రమైన రోజు ఈ ఏకాదశి.  ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఆరోజు ముఖ్యంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఒక్క ఏడాదిలో ఇరవైనాలుగు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశీ పవిత్రమైనదే.

గతేడాది రికార్డు స్థాయిలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపద మొక్కుల వాడికి కానుకల వర్షం కురిపించారు. 2016 సంవత్సరంలో 2.55 కోట్లమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్క డిసెంబర్‌ నెలలోనే హుండీ ద్వారా రూ. 85 కోట్ల ఆదాయం లభించగా...గత ఏడాది కంటే అదనంగా 20.73 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 3:00 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2:00 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3:00 గంటలు పడుతోంది. ఈ  ఉదయానికి 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.