ఇవాళ వేకువజామున సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు సింహాద్రి అప్పన్నకు తొలిపూజ చేశారు.

తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి నిత్యకళ్యాణంలో  భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గటన్నర సమయం పడుతోంది. భద్రతా దృష్ట్యా కొండపైకి వాహనాలు అనుమతించలేదు అధికారులు.

తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం  పడుతుంది.

తిరుమల కొండపై భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3గంటలు, నడకదారిన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. 

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.