తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాంతో అన్ని కంపార్ట్ మెంట్లూ నిండి వెలుపల కూడా భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు పది గంటలు పడుతోంది. 

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్టమెంట్లల్లో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా కాలినడక భక్తులకు పది గంటలు పడుతోంది. కాగా ఎన్నడూ లేనివిధంగా గదులకోసం కౌంటర్ల వద్ద భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

 

 

సింహాద్రి అప్పన్న స్వామి దర్శనం కోసం రాత్రి 12 గంటల నుండి వేలాదిమంది భక్తులు క్యూకట్టారు. అయితే దేవస్థానం అధికారులు పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని మొత్తం క్యూలైన్లంతటికీ చలువ పందిళ్లను ఏర్పాటు చేసారు. సుమారు 2 లక్షల 50 వేల మంది వస్తారన్న అంచనా వేస్తున్నారు. అయితే వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఆటంకం కలుగకుండా పెద్దఎత్తున క్యూలైన్లు ఏర్పాటుచేసి భక్తులందరికీ దర్శనం కల్పించాలని విస్తృత ఏర్పాట్లు చేసారు. 

ఇవాళ వేకువజామున సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు సింహాద్రి అప్పన్నకు తొలిపూజ చేశారు.

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.