ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక జయంతి ఉత్పవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు చివరి రోజు కావడంతో స్వామి అమ్మవార్లకు సహస్రకళాభిషేకం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.

అనంతపురం జిల్లా ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. క్రీస్తుపూర్వం 950 సం క్రితంనాటి ఈ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రతియేడూ వైకుంఠ ఏకాదశి నాడు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న స్వామివారి పాదాలను తాకుతాయి. అంతటి మహా మహిమాన్వత మూర్తి రథోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుండే గాక ఇతర రాష్ట్రాల భక్తులు కూడా భారీగా తరలివచ్చారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. 

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు సీతారాముల అలంకారములో భక్తులకు ప్రత్యేక దర్శనం ఇచ్చారు. ఏకాదశి ఉత్సవాల్లో సాయంత్రం ఋత్విగ్వరణ, మృద్గహణ, అంకురార్పణ, ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం హంస వాహనంపై స్వామివారు పుర వీధులలో విహరించారు. 

తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఏడు గంటలు, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. తిరుమలేశుని ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. 

 

 

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.