అమర్ నాథ్ యాత్రికులకు శుభవార్త అమర్ నాథ్ మంచు శివలింగం ఈ ఏడాది సంపూర్ణంగా ఏర్పడింది. అంతేకాదు శివలింగం ఆకారం కూడా చాలా పెద్దగా ఉందని, అమర్ నాథ్ గుహ మంచుతో కప్పేసి ఉండడం వల్ల ఈ ఏడాది అమర్ నాథ్ మంచు లింగం ఎక్కువ రోజులు కరిగిపోకుండా ఉంటుందని అమర్ నాథ్ గుడి బోర్డు వెల్లడించింది. వచ్చే నెల 29 నుంచి ఆగస్టు 7 వరకు అమర్ నాథ్ మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఆన్ లైన్ లో బుకింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి.

తిరుపతి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడని, సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయని, లోకమాత అయిన శ్రీపద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. సాక్షాత్తు కలియుగ వైకుంఠ నాథుడి పత్ని పద్మావతి అమ్మవారు తిరుమాడ వీదులలో విహరిస్తుంటే భక్తులు పెద్ద సంఖ్యలో గొవింద నామ స్మరణలతో అమ్మావారికి హారతి నీజరానాలు అర్పించారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోండగా, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి పరమ భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమంబ 287వ జయంతి ఉత్సవాలను టీటీడి ఘనంగా నిర్వహించింది. తిరుమలలో ఎస్.వి.బి.ఎన్.ఆర్ స్కూల్ ప్రాంగణంలో గల వెంగమాంబ సమాధి వద్ద టీటీడి అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ రచించిన పలు సంకీర్తనలను గోష్టిగానం చేశారు. 

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.