నల్గొండ జిల్లా శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున అగ్నిగుండాలు జరిగాయి. పెద్దసంఖ్యలో భక్తులు, శివసత్తులు అగ్నిగుండాలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఆలయసిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల శివనామస్మరణతో మారుమోగింది.

రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో మలయప్ప స్వామికి వాహనసేవలు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం సూర్యప్రభ, చినశేష వాహన సేవలపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు.. 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై విహరించారు. గరుడునిపై ఆశీనులైన మలయప్ప స్వామి వారిని దర్శించుకున్న యాత్రికులు గోవింద నామస్మరణలు చేస్తూ కర్పూర హారతులు పట్టారు. వేలాది మంది భక్తులతో తిరువీధుల్లోని గ్యాలరీలు నిండిపోయాయి. 

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ చాలా సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు పడుతుంది.

వసంత పంచమి వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే అమ్మవారికి మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలను నిర్వహించారు.

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.