తిరుమల శ్రీవారికి కొందరు భవంతులిస్తారు...మరి కొందరు భూములిస్తారు. ఇంకొందరు వజ్ర, వైడూర్యాలతో పొదిగిన ఆభరణాలు కానుకలుగా చెల్లిస్తారు. కానీ కడప జిల్లా పులివెందులకు చెందిన రామాంజులరెడ్డి మాత్రం ఓ అపురూపమైన, అరుదైన కానుకను శ్రీవారికి సమర్పించుకున్నారు.

ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన గండికోట ఉత్సవాలను ఈ నెల 18, 19 తేదీలలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2015వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఘనంగా నిర్వహించిన గండికోట ఉత్సవాలను ప్రతి సంవత్సరం అదే తేదీలలో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు సాధ్యం కాలేదు. కడప జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పురాతన కట్టడమైన గండికోట ఉత్సవాలను నిర్వహించి నాటి చరిత్రను మననం చేసుకుంటూ నేటి తరానికి తెలియజెప్పేందుకు తిరిగి నేడు గండికోట ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించడంతో జిల్లా యంత్రాంగంతో పాటు పర్యాటక శాఖ ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది.

తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో రాంబగీచా అతిధి గృహం వద్ద గుండెపోటుతో ఓ భక్తుడు మృతి చెందాడు. కర్నాటక మైసూరుకు చెందిన మురళి(50) శ్రీవారి దర్శనార్ధం వచ్చాడు. మురళికీ హటాత్తుగా గుండెపోటు రావడంతో అతిధి గృహం ఎదురుగానే కుప్పకూలిపోయాడు. ఇలా వరుసగా తిరుమలో చోటుచేసుకుంటున్న మరణాల ఘటనల వల్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు.

 

యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు స్వామి వారు రామావతారంలో హనుమంత వాహనం పై ఊరేగుతూ భక్తులకు దర్శన మిచ్చారు. వజ్ర వైఢుర్యాలతో స్వామివారు ఆలయ తిరువీదుల్లో ఊరేగుతూ ధగధగ మేరిసిపోయారు.

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.