సకల సృష్టికి విజ్ఞానాన్ని అందించ గలిగే తల్లి సరస్వతి. ఆమె కరుణిస్తే తీగలు తెగి మూగవోయిన విపంచి తీయనైన రాగామృతాన్ని పంచగలదు. అక్షరాలు రాని నిరక్షరాస్యుడు కూడా అద్భుతమైన కావ్యాలు రాసే స్థాయికి ఎదగ గలడు. అంటే- వెర్రివాడు విద్వాంసుడవుతాడు. మందబుద్ధి గ్రంథకర్త అవుతాడు.  అటువంటి కరుణాంతరంగిణికి ఆవాసమైన సుక్షేత్రాన్నే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అదే బాసర. అక్కడ కొలువున్న తల్లే మనకు ఆసరా! రండి! దర్శించి అమ్మవారి దయకు పాత్రులమవుదాం.

మనిషికి తెలియని దివ్యశక్తి ఏదో ఈ ప్రపంచాన్ని నడిపిస్తోందన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఆ శక్తికి ఎవరికి తోచిన రీతిలో వారు పెరు పెట్టుకున్నారు. నమ్మి కొలిచే వారు దేవుడన్నారు. అధునికులు సైన్స్ అన్నారు. ఏమైనా మూలం మాత్రం ఊహకు అందడంలేదన్నది వాస్తవం. జీవం ఉట్టిపడేలా మనిషినైతే సృజించ గలుగుతున్నాడు గానీ, ఆ మనిషికి ప్రాణం మాత్రం పొయ్యలేక పోతున్నాడు. అదిగో! ఇక్కడి నుంచే మొదలవు తుంది ఆ మానవాతీత, అదృశ్య, దివ్య,  దైవశక్తి. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడం ఆ అపురూప శక్తికే మాత్రమే సాధ్యమవుతోంది. అలాంటి ఆ శక్తికి దాసోహమంటే పోయిందేముంది? ఆ శక్తినే భగవంతునికి శిరసు వంచి పూజిస్తే ఏమవుతుంది? ఆ శక్తికున్న విలువ తెలుస్తుంది. ఆ శక్తిపై భక్తి పెరుగుతుంది.

రూపాల్లో భిన్నత్వం ఉండొచ్చు కానీ, భక్త రక్షణలో మాత్రం ఏ లోపం రానీయడు. నామాలు అనంతంగా ఉండొచ్చు కానీ, నీమంగా పిలిస్తే నేను నీవాడనేనంటూ ఎప్పుడూ మనకు చేరువలోనే ఉంటాడు. అందుకే ఆయన అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు. భక్తితో కొలవాలే కానీ, కాపాడేందుకు ఆయనెప్పుడూ సిద్ధం గానే ఉంటాడు. అలా ఎంతమందినో కాపాడాడు కూడా. కాకపోతే, మధ్యమధ్యలో మన భక్తిలో ఎంత వరకూ నిజాయతీ ఉందన్న విషయంలో పరీక్షలు పెడుతుంటాడు. వాటికి తట్టుకుని నిలబడి స్వామి హృదయాన్ని గట్టిగా ఆకట్టుకోగలిగితే ఆయన ఇక ఎప్పుడూ మన చెంతనే ఉండిపోతాడు. లేదా మననే ఆయన చెంత ఉండే భాగ్యాన్ని కలగచేస్తాడు. అంతటి అనంత కరుణామూర్తి ఆయన. అలాంటి కరుణాసముద్రుని చెంతకే మన మిప్పుడు వెళ్ల బోతున్నాం.  పదండి.

అసలు ప్రకృతే గొప్ప చిత్ర కారుడు. పచ్చనిపచ్చని ప్రకృతి, అందుకు ప్రతీకలై నిలిచే చెట్లు – చేమలు, కొండలు – బండలు, రాళ్లు – రప్పలు ప్రకృతి అందాల్ని మరింత ద్విగుణీకృతం చేస్తాయి. అలా మామూలుగా పడి ఉంటేనే ఇంత అందాల్ని అందిస్తున్న కొండలు, బండల్ని చేయి తిరిగిన ఎంతో మంది శిల్పులు తమ కళా నైపుణ్యంతో ఉలిని చేత పట్టుకుని అందమైన ఆకృతులుగా తీర్చి దిద్దితే అవి మరెంత అందాల్ని ఒలికిస్తాయో కదా! అప్పుడవి కొండలు, బండలు కావు,  మనసును ఆనంద డోలికల్లో తేలియాడింప చేసే హంసతూలికా శిల్ప తల్పాలు. లయ తప్పిన హృదయ విపంచిని సవరించి మేలుకొలుపులు పాడే సుప్రభాత గీతికా మాలికలు. ఏమిటిదని ఆశ్చర్య పోతున్నారా? ఇవన్నీ నిజాలేనని నిరూసిస్తుంది వరంగల్ లోని వేయిస్తంభాల గుడి. ఈ ఆలయాన్నే మన మిప్పుడు చూడబోతున్నాం. పదండి ! ఆ ఆనందామృత రసధారల్ని చవిచూసేద్దాం.

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...