శ్రీశైలం మహా పుణ్యక్షేత్రానికి కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఉగాది మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. దాంతో ఆంధ్ర-తెలంగాణ రహదారులు నిండిపోయాయి. ఆదివారం సెలవు కావడతో భక్తులు రాకపోకలు అనూహ్యంగా పెరిగింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. టోల్ గేట్ వద్ద వాహనాలకు టికెట్ ఇవ్వటానికి ఎక్కువ సమయం పడుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం జరిగింది. రథంపై వూరేగుతూ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కర్పూర నీరాజనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అమ్మవారు అధిరోహించిన రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.

 

గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామిని గవర్నర్‌ నరసింహన్‌ దర్శించుకున్నారు.

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...