పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.

సంక్రాంతి అంటే ముత్యాల ముగ్గులే కాదు నోరూరించే పిండివంటలకూ ఈ పండుగ ప్రత్యేకత. సంక్రాంతి అంటే...ఊళ్లల్లో వారం ముందు నుంచే పిండి వంటల హడావిడి మొదలయ్యేది ఒకప్పుడు. ఊరంతా నెయ్యి వాసనతో గుబాళించేది. పండగ వంటలు చేయడంలో ఊరు ఊరంతా బిజీగా ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా పిండి వంటలు స్వగృహాల్లో కాకుండా... 'స్వగృహ ఫుడ్స్'లో తయారవుతున్నాయి. రెడీమేడ్ దుస్తులు, రెడీమేడ్ నగల్లాగే వీటిని కూడా రెడీమేడ్‌గా కొనుక్కుని 'సంక్రాంతి' జరుపుకుంటోంది నవతరం.

మన తెలుగు వారి పెద్ద పండుగ మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. మూడు రోజుల పాటు జరిగే పండుగలో మొదటి రోజు 'భోగి'. భోగి పండుగ అనే పదానికి 'తొలినాడు' అనే అర్ధం ఉంది. అనగా పండుగ తొలినాడు అని అర్ధం. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని హిందువుల విశ్వాసం.

వరంగల్‌: కార్తీక శోభతో తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలైంది. ఇవాళ తొలి సోమవారం కావడంతో అన్ని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలం, మహానంది, యాగంటితో పాటు వేములవాడ రాజన్న ఆలయం, వరంగల్‌లోని వేయిస్తంభాల గుడి, కీసరలోని రామలింగేశ్వర ఆలయాలకు భక్తుల తరలి వచ్చారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరంలో 5 కార్తీక సోమవారాలు రావడం విశేషం.

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.