దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల రద్దీతో పోటెత్తింది. వేసవి సెలవులు కావడంతో భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. ఒక్క రోజులోనే సుమారు 50 వేలకు పైగా భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. 

 

కడపజిల్లా జమ్మల మడుగు పవిత్ర పెన్నానది తీరాన వెలసిన నారాపుర వేంకటేశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది.

తిరుమలకొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలేశుడిని దర్శించుకునేందుకు 36 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలు, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలో అన్నమయ్య జయంతి సందర్భంగా శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. టీటీడీ దేవస్థాన అధికారి ముక్తికేశ్వర రావు ఉత్సవాలను పర్యవేక్షించారు.