దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కన్నుల విందుగా జరిగింది. స్వయంభూ విలసిన దేవుడు ఉమారామలింగేశ్వర స్వామిగా చెప్పబడుతున్న స్వామి అమ్మవార్ల కళ్యాణం వేద మంత్రోత్సములు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. లోకకళ్యాణార్థం వర్షాలు సైతం సంవృద్ధిగా కురుస్థాయని వేదపండితులు తెలిపారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు భక్తులు స్వీకరించారు.

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుతున్నాయి. నాలుగో రోజు ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోర్కెలు తీర్చే వరాల వృక్షంగా కల్పవృక్షాన్ని భావిస్తారు. 

 

 

 

ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు కారిరిష్టి వరుణ యాగాన్ని నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలకి నీటి కటకట రానున్న నేపద్యంలో సకాలంలో వర్షాలు రావాలని వరుణయాగం తలపెట్టింది.

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కఠారిలంకలో మహాలక్ష్మి అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గ్రామస్థులు ఎంతో భక్తి ప్రపత్తులతో నిర్వహిచే జాతరలో అసభ్యకర నృత్య ప్రదర్శన ఏర్పాటుచేశారంటూ పలు విమర్శలు చోటుచేసుకున్నాయి. దీంతో భక్తులు తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.