దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

చంద్రగ్రహణం కారణంగా ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయం సాయంత్రం 4 గంటలకే మూతపడనుంది. రాత్రి 10.52 గంటలకు చంద్రగ్రహణం మొదలై అర్ధరాత్రి 12.48 వరకు కొనసాగనుంది.

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రతినెల జరిగే పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించింది టిటిడి. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో తిరుమాడా వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో తిరుమల నాలుగు మాడవీధులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. ధర్మప్రచారపరిషత్‌ మరియు అన్నమాచార్యప్రాజెక్టు కళాకారులతో కోలాటాలు, చెక్క భజనలు కోలాహాలంగా నిర్వహించారు. 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడకన భక్తులకు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దర్శనం క్యూలైన్లు నిండి ఆలయం వెలుపల వరకు రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి సుమారు రెండుగంటల సమయం పడుతోంది. యాబైవేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.