దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

తెలంగాణలో ప్రసిద్దిగాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చిన్నహనుమాన్‌ జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు చైత్ర శుద్ద పౌర్ణమి రోజు వచ్చే హనుమాన్‌ జయంతితో ఉత్సవాలు ముగియనున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. అర్చకుని చేతిలోంచి జారి అమ్మవారి ఉత్సవ విగ్రహం కిందపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల కోలాహలం మధ్య అభిజిత్ లగ్న సుముహూర్తన నెల్లూరులోని శబరి శ్రీరామక్షేత్రంలో రాములోరి కళ్యాణం కన్నులపండుగా జరిగింది. నీలమేఘ శ్యాముడు, జగదబిరాముడు శ్రీరాముని కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు శబరి క్షేత్రానికి తరలివచ్చారు. శ్రీసీతారామ కళ్యాణాన్ని వీక్షించేందుకు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ సతీసమేతంగా పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రెండవ భద్రాద్రిగా పేరొందిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లలమామిడాడ గ్రామంలో వేంచేసిన శ్రీ కోదండరామచంద్రమూర్తి ఆలయంలో ఐదురోజులపాటు జరిగే శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తిచేశారు. కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దంపతులు నూతన పట్టువస్త్రాలను, తలంబ్రాలను సమర్పించనున్నారు.