దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

కార్తీకమాసం మొదలు కావడంతో శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పంచారామంలో ఒకటైన శ్రీ క్షీరరామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారికి దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో పూజించారు.

 

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సుమారు నెల రోజుల పాటు జరిగిన సంబరాలు అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవంతో ముగిశాయి.

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన రాత్రి గరుడ వాహన సేవ నిర్వహించారు. గరుడవాహనంపై స్వామివారు తిరువీధుల్లో విహరించారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. స్వామివారి గరుడ వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.

నేటి నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భద్రాచలం దేవాలయం అధికారులు ఘనంగా ఉత్సవాల్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.