దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

భక్తిరసంలో ఓలలాడగలిగిన వారు మాత్రమే అందులోని పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించ గలుగుతారు. అలాంటి వారికి పరమేశ్వరుడు, పరంధాముడనే తేడాయే ఉండదు. అలాంటి వారికి దైవాన్ని చేరు కోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఆ విధంగా దైవంలో ఐక్యమైన వారు ఎంతో మంది ఉన్నారు. ఇంకా చెప్పా లంటే భగవంతుని కంటే భక్తుడే గొప్పవాడన్నది నిర్వివాదాంశం. ఈ విషయాన్ని ధృవీకరించిన భక్తులు ఎంతో మంది ఉన్నారు కూడా. అలాంటి పరమ భక్తుల్లో ఈమె ఒకరు. వారిలో పరంధామునికి అత్యంత ప్రియమైనది, ఆయన కోరి మెచ్చిన నెచ్చెలి, హృదయాంతరంగిణి అయిన పరమ భక్తురాలి దివ్యాలయానికే మనం ఇప్పుడు చేరుకోబోతున్నాం. అంతగా స్వామి హృదయాన్ని దోచుకున్న ఆ పరమ భక్తురాలు ఎవరు? ఆ ఆలయం ఎక్క డుంది? తదితర విషయాలను తెలుసుకుందాం పదండి !

చూడాలనే ఆసక్తి, ఓపిక ఉండాలే కానీ, మన కళ్లెదుటే ఎన్నో అద్భుతాలు, అందాలు కనువిందు చేస్తూ కదలాడుతుంటాయి. కాకపోతే కొంచెం వాటిమీద దృష్టి పెట్టాలంతే ! అయితే పక్కవాణ్ణి కూడా పట్టించుకోనంత బిజీ ప్రపంచంలో మనుగడ సాగిస్తున్న మనకు అంత సమయం దొరుకుతుందా అనేది ఆలోచించాల్సిన విషయమే.  దీని వల్ల మనం ఎన్నో ఆనందాల్ని, అందాల్ని, అద్భుతాల్ని కోల్పోతున్నాం సరికదా, వీటి స్థానాల్లో లేనిపోని అనా  రోగ్యాన్ని ‘కొని’ తెచ్చుకుంటున్నాం.  అందుకే మనకోసమంటూ కొంత సమయాన్ని కేటాయించుకుంటే మనసు నకు ప్రశాంతతే కాకుండా హాయిగా, ఆరోగ్యంగా కూడా మనగలుగుతాం. ఇంతకు ఆ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలి గించే ప్రదేశం ఎక్కడో లేదు. ఇక్కడే మనకు కొన్ని వందల కి.మి.లోనే ఉంది. అదే వరంగల్. అక్కడ ఉన్న రామప్ప దేవాలయం. ఇప్పడు దాన్నే దర్శించి ఆనందానుభూతుల్ని పొందుదాం రండి. 

భగవంతుడు ఎప్పుడు ఏ రకంగా అవతరిస్తాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడెక్కడ, ఎలా ఆవిర్భవిస్తాడో తెలియదు. కానీ, బలవంతుల మోసాల నుండి బలహీనులను కాపాడేందుకు ఎప్పటికప్పుడు అవతరిస్తాడనేది మాత్రం నిజం. అలా అమాయకులైన గిరిజనులు, కొండ ప్రాంతాల వారిని ఆదుకునేందుకు పరమేశ్వరుడు అవతరించి వారి ఇలవేలుపుగా కొలుపులందుకుంటూ వారి పాలిటి కల్పవృక్షంగా మారిన ప్రదేశానికే మన మిప్పుడు వెడుతున్నాం. పదండి !

ప్రపంచాన్ని మొత్తం తన కరుణా కటాక్ష వీక్షణాలతో ఒక్క క్షణంలో సృష్టించగలదా జగన్మాత.  ఆగ్రహావేశాలతో అదే ఒక్కక్షణంలో భస్మమూ చెయ్యగలదు. అయితే ఆమెది అమ్మ మనసు. అమ్మ ఎప్పుడూ బిడ్డల ఎదుగుదలనే కోరుకుంటుంది తప్ప దిగజారిపోవడాన్ని తట్టుకోలేదు. అందుకే కోపం వచ్చినప్పుడు కొంచెం భయపెట్టినా అది బిడ్డ మంచికోసమే తప్ప మరోటి కాదు. అలా భయపెట్టిందని కోపంతో అమ్మను వీడిన వాడు మనిషి. లేనివాడు మనీషి. మరి మనం మనుష్యులమో, మనీషులమో మనమే ఆలోచించుకోవాలి... ఒక కంట ఆగ్రహం, మరో కంట అనుగ్రహం రెంటినీ ఒకేసారి ప్రదర్శిస్తూ లోకాన్నంతటినీ భద్రంగా చూసుకునే అమ్మవారి ఆలయాన్నే మన మిప్పుడు చూడబోతున్నాం. పదండి…!