Print
Hits: 877

బెంగళూరు: రేపే కుమారస్వామి ప్రభుత్వానికి చివరి రోజు అంటూ కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. గురువారమే బలపరీక్ష జరగాల్సి ఉండగా... అది రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో స్థానిక రమద హోటల్ వద్ద యడ్డి మీడియాతో మాట్లాడుతూ... 'ఎవరి బలం ఏంటో రేపు అసెంబ్లీలో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు బలపరీక్షకు రావాలని ఒత్తిడి చేయకూడదని సుప్రీం కోర్టు చెప్పింది. కానీ కాంగ్రెస్ నేతలు రెబెల్ ఎమ్మెల్యేలను భయపెడుతున్నారు.వారు సభకు రావాలని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ జారీ చేసిన విప్‌లకు ఏ మాత్రం విలువ లేదు. సీఎం అయి ఉండి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా కుమారస్వామి వ్యవహరిస్తున్నారు. గవర్నర్‌ మాటలను, సీఎం కానీ స్పీకర్ కానీ పట్టించుకోవడం లేదు. సీఎం కుమార స్వామితో పాటు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌, సీఎల్పీ నేత సిద్ధరామయ్య రేపటి అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలి. వీటన్నింటికీ రేపు అసెంబ్లీలో సమాధానం దొరుకుతుంది. రేపే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు’ అని యడ్యూరప్ప అన్నారు.

e-max.it: your social media marketing partner